సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కుట్ర

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 17 : ‌కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు వెళ్తున్న క్రమంలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా షేర్‌ ‌చేశారు. ‘నేను స్వాతంత్య ్రసమరయోధుడు భగత్‌ ‌సింగ్‌ ‌ను అనుసరించే వాడిని. జైలుకు వెళ్లడానికి భయపడను. దేశం కోసం భగత్‌ ‌సింగ్‌ ‌కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది‘ అంటూ మనీష్‌ ‌సిసోడియా ఉద్వేగంగా ప్రసంగించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియాపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయన్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విజయ్‌ ‌నాయర్‌ ‌ను ఎందుకు కలిశారు ? మద్యం పాలసీ విధానంలో ఆయనను ఎందుకు భాగస్వామ్యం చేశారు అనే కోణంలో  ప్రశ్నిస్తున్నారు. కొత్త మద్యం పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పడిపోతుందని కు తెలియదా? అలా చేయడం వల్ల ప్రభుత్వంలో ఎవరు లబ్ది పొందుతారనే క్వశ్చన్స్ ‌ను సంధిస్తున్నారు.

కొత్త మద్యం పాలసీలో కొద్దిమంది వ్యాపారులనే ఎందుకు ఎంపిక చేశారని మనీష్‌ ‌సిసోడియాను సీబీఐ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రభుత్వం, వ్యాపారస్తుల మధ్య క్విడ్‌ ‌ప్రొకో జరిగిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపకల్పనలో తెలంగాణ వ్యక్తులను కలిశారా అని  ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. తెలుగు రాష్టాల్రకు చెందిన రామచంద్ర పిలళై, శరత్‌ ‌చంద్ర, రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *