హరి హరాదుల ప్రియమాసం కార్తీకం

హరిహరాదులకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. దీపావళి మరు సటి రోజు నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులూ భక్తులు నిత్యం శివనామం స్మరిస్తారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకత సంతరిం చుకుంది. ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోరుకుంటూ మహిళలు పూజలు చేస్తారు. ఈ మాసంలో కార్తీకశుద్ధ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ ఏకాశి నాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు ఉపవాసముండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే శ్రేయస్కరమని నమ్మకం. ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటాడు కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిస పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్నరోజు కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినాన ప్రతి ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఇంటిల్లి పాది ఉపవాసాలుండి నోము నోచుకుని శివుడిని ధ్యానిస్తారు.. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తుల నమ్మకం. పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున ముత్తైదువులు రెండు రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ల నోము. కార్తీక పౌర్ణమిన చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు ఆపై సంవత్సరం పది మందికి మూడో ఏడాది పదిహేను మందికి చొప్పున వాయినాలిస్తారు. రెండోది కృత్తికా దీపాల నోము. ఆరోజు రాత్రి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరవాతి సంవత్సరం 240 దీపాలు, ఆపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా… కార్తీక పౌర్ణమినాడు నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఆ రోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందట. లలితా సహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలనూ అందిస్తుందట.

పౌర్ణమిరోజు వేకువన గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటి దొప్పలతో దీపాలు వెలిగించి నీటిలో వదు లుతారు. తమ కోర్కెలు నెరవేరతాయనే సంక ల్పంతో వివాహం కాని యువతులు కార్తీ కదీపాలను నదుల్లో వదులుతారు. నైమి శారణ్యంలో శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నివసించిన అది గురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం ఋషులకు బోధించాడని ప్రతీక.. ఈ వ్రతవిధానం ఈశ్వరుడు పార్వ తీదేవికి, బ్రహ్మదేవుడు నారదునికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి చెప్పారని స్కంధ పురాణంలో వివరించడం విశేషం. కార్తీక పౌర్ణమి రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలో తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగి ంచి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇస్తారు. నక్షత్రాలు కను మరుగు కాకముందే ఈ పూజ పూర్తి చేయాలని చెబుతారు.

కార్తీక సోమవారాలు – నదీ స్నానాలు
కార్తీకమాసం నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తుల విశ్వాసం. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసం వేకువ వేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనః కారకుడైన చంద్రుని ప్రభావం దేహం పైన, మనస్సు పైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి ఏర్పడే ఇబ్బందిని నివారి ంచడానికి కార్తీక మాసం ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించడమనే అనవాయితీ పూర్వం నుంచీ కొనసాగుతోంది. కార్తీకమాసంలో శీతల స్నానమాచరించడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అలాగే ఈ నెలరోజులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని విజ్ఞులు పేర్కొంటారు. ఈ నెలలో ముఖ్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన వారికి మహత్తరశక్తి కలుగుతుందని విశ్వాసం.

కార్తీక పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమిన నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్ను డౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీక. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయడం వల్ల దారిద్యం తొలగి పోతుందని మరో నమ్మకం. కార్తీక పౌర్ణమిన లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని, కార్తీకపౌర్ణమి రోజున చేసే దీపారాధన వలన శివుని అను గ్రహం లభిస్తుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని చెబు తుంటారు.
– నందిరాజు రాధాకృష్ణ, 98481 28215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *