రాహల్‌ ‌జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో రాహుల్‌ ‌జోడోయాత్ర సాగుతున్న తరుణంలో అటు కాంగ్రెస్‌  ‌నేతల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ స్పష్టంగా జోష్‌ ‌కనిపిస్తుంది. రాహుల్‌ ఈ ‌సందర్భంగా తాము మళ్లీ అధికారంలోకి వొస్తామన్న భరోసా వారికి కల్పిస్తున్నారు. దీనికితోడు ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తామని హావి•లు ఇస్తూ రాహుల్‌ ‌గాంధీ ముందుకు సాగుతుండడంతో యాత్రలో నేతలంతా ఉత్సాహంగా కలిసి నడుస్తున్నారు.

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యం వారిలో బలపడింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్‌ ‌బలహీనపడితే నష్టం ఆ పార్టీకి మాత్రమే కాదు.. టీఆర్‌ఎస్‌కు కూడా అంటుకోనుందనే భావన రాజకీయ విశ్లేషకులలో ఉంది. తెలంగాణలోని గ్రామాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది. అంతేకాదు, ఆ పార్టీ ఇటీవల నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *