టిఆర్‌ఎస్‌ ‌వైఖరిపై విసుగెత్తిన ప్రజలు

  • ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో అభాసుపాలు : బిజెపి ఎంపి లక్ష్మణ్‌
  • ‌తప్పు చేయకుంటే కెసిఆర్‌కు సిబిఐ అంటే భయమెందుకు : బిజెపి నేత డికె అరుణ

హైదరాబాద్‌, అక్టోబర్‌, అక్టోబర్‌ 30 : ‌మునుగోడు ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బిజెపి ఎంపి డా।। లక్ష్మణ్‌ అన్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో టిఆర్‌ఎస్‌ ‌నేతలు అభాసుపాలయ్యారని తెలిపారు. అసలు రాష్ట్రంలో ఫిరాయింపులకు టిఆర్‌ఎస్‌, ‌కెసిఆర్‌ ‌పెట్టింది పేరని విమర్శించారు. 2018 ఎన్నికల తర్వాత టిఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఇంతటి ఫిరాయింపుల చరిత్ర ఉన్న టిఆర్‌ఎస్‌ ‌బిజెపిపై నిందలు వేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. కానీ ఇతర పార్టీల నుంచి వొచ్చే వారిని రాజీనామా చేయించి మళ్లీ తమ పార్టీ గుర్తుపై ఎన్నికలలో ఎంఎల్‌ఏగా ఎన్నుకున్న సంప్రదాయం బిజెపిదని అన్నారు.మునుగోడ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కెసిఆర్‌ ‌నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు.

తప్పు చేయకుంటే కెసిఆర్‌కు సిబిఐ అంటే భయమెందుకు : బిజెపి నేత డికె అరుణ
సిఎం కెసిఆర్‌ ‌తప్పు చేయకుంటే, మోసం చేయకుంటే సిబిఐ అంటే ఎందుకు భయపడుతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ప్రశ్నించారు. జిఓ 51 విడుదలపై ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణకు సిబిఐ రాకుండా జిఓ 51 ఎందుకు విడుదల చేశారని అన్నారు. జిఓ రెండు నెట కిందనే విడుదల చేసినా ఇప్పటి వరకు ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని దోచుకోకపోతే జిఓ జారీ చేసి ఈడి, సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా చేస్తే ఏమీ చేయలేరని అనుకోవద్దని, ఎక్కడ ఉన్నా బయటకు తీసుకుని వొస్తామనిఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *