ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారు

  • రాజగోపాల్‌ ‌రెడ్డి సవాల్‌ను కెసిఆర్‌ ‌స్వీకరించాలి
  • మీడియా సమావేశంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌

నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారని సిఎం కెసిఆర్‌ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశించారు. ఈ విషయంలో తమ అభ్యర్థి రాజగోపాల్‌ ‌రెడ్డి సవాల్‌ను కెసిఆర్‌ ‌స్వీకరించాలని ఆయన ఆదివారం మర్రిగూడ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్‌ ‌చేశారు. తమ దుకాణం మూత పడుతుందని కెసిఆర్‌ ‌భయపడుతున్నారని, టిఆర్‌ఎస్‌ ఆదివారం చండూరులో ఏర్పాటు చేసిన మీటింగ్‌  ఒక టైమ్‌ ‌పాస్‌ ‌మీటింగని, ప్రజలు నవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఎన్ని నిధులిచ్చారో, ఏం చేశారో కెసిఆర్‌ ‌సభా వేదిక ద్వారా చెప్పాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

నియోజక వర్గ అభివృద్ధిపై న్లిక్ష్యం వహిస్తున్నారనే రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా చేశారని అన్నారు.  అభివృద్ధిపై ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపాలన్నారు. కేంద్రం సంక్షేమ పథకాను ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని అన్నారు. తమ అభ్యర్థిని పక్కన ఉంచుకుని ప్రచారానికి వెళ్లడానికి ఎందుకు అవమానంగా భావిస్తున్నారని ప్రశ్నించారు. బహిరంగ సభలో కెసిఆర్‌ ‌తన ఏడ్పు ద్వారా సింపథీ పొందాలని చూసున్నాడని అనారు. కెసిఆర్‌ ‌పాత్రలో నటించేవాడు కాదని, జీవించేవాడని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *