వోటు అంటే…
సిరా చుక్క కాదు
కాగిత ముక్క కాదు
సంతలో సరుకు కాదు
రెండక్షరాల పదం కాదు
అది దేశ పౌరుల ఆయుధం
రాజ్యాంగం కల్పించిన హక్కు
వోటు అనే దివ్యశక్తి
దేశ చరిత్ర మార్చేస్తుంది
ప్రగతి పథం నిర్దేశిస్తుంది
వోటు ఆయుధంతో
పీఠాలు నిలబెట్టవచ్చు
అదేతీరుగా కూల్చవచ్చు
రాజకీయ నాయకులను
పార్లమెంటుకు పంపవచ్చు
ఇంటిముఖం పట్టించవచ్చు
మిత్రమా !నీ మేటి వోటు
చట్టసభలో గొంతు కావాలి
రాజ్యపాలనా యంత్రాంగంలో
నీ ఆకాంక్ష రూపంగా నిలవాలి
అందుకే ఇకనైనా..
మందుకు మనీకి లొంగక
విందు,వినోదాలకు తలొగ్గక
బూటకపు మాటలకు ఉబ్బక
కుతంత్రాల ఉచ్చుల చిక్కక
ఓటు విలువ ఎరిగి మసలుకో
జన సంక్షేమంకై పరితపించే
దేశ ప్రగతి కోసం పరిశ్రమించే
సద్గుణనేతకు వోటు కట్టబెట్టు
ప్రజాస్వామ్య సౌధం నిలబెట్టు
( మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493




