- గవర్నర్ తీరుకు నిరసనగా కదం తొక్కిన కార్మికులు
- వీయియో కాన్ఫరెన్స్ ద్వార గవర్నర్ చర్చలు
- బిల్లు ఆమోదించేందుకు పలు అభ్యంతరాలు
- వివరాలు అందచేసిన తెలంగాణ ప్రభుత్వం
- గవర్నర్ హాతో వెనుదిరిగిన కార్మిక సంఘాల నేతలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై తొక్కిపెట్టడం సంస్థ కార్మికులు, ఉద్యోగులు భగ్గుమన్నారు. శనివారం ఉదయం 2 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు ధర్నాలు చేసిన కార్మికులు.. రాజ్‌భవన్‌ను ముట్టడించారు. దీంతో రాజ్‌భవన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. అయితే పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళసై కార్మిక నేతలను యర్చకు ఆహ్వానించారు. బిల్లు వల్ల కార్మికులకు లాభం చేకూరాలన్ ఆకాంక్షను వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక నేతలతో మాట్లాడారు. బిల్లుపై కొన్ని అభ్యంతరాలను ప్రభుత్వం నుంచి వివరన కోరారని, అవి రాగానే వెంటనే పంపుతానని వారికి హా ఇచ్చారు. కార్మికుల పక్షాన ఎప్పుడూ ఉంటానని అన్నారు. అయితే గవర్నర్ సందేహాలను ప్రభుత్వం తీర్చిందని అంటున్నారు. మొఒత్తంగా రాజ్‌భవ్ వద్ద ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. చలో రాజ్‌భవన్ పిలుపుతో భారీగా పోలీసులు మొహరించారు. గవర్నర్ సమాధానం తో కార్మిక సంగాల నేతలు సృంతప్తి చెందారు.
త్వరా బిల్లు చేరేలా చూడాలన్నారు. అంతకు ముందు చలో రాజ్‌భవన్ పిలుపుతో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మకులు రాజ్‌భవన్ వద్ద ధర్నాకు దిగారు. ముందుగా నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో పెద్దఎత్తున తరలివచ్చారు. 11 గంటలకు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్ళారు. ఆర్టీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని కార్మికులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం బిల్లును రూపొందించింది. బిల్లును ఆమోదం కోసం గవర్నర్ తమిళసైకి పంపించింది. అయితే వివిధ కారణాలతో గవర్నర్ తమిళిసై బిల్లును తొక్కిపెట్టారు. దీంతో ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. గవర్నర్ వైఖరికి నిరసనగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులను నిలిపివేశారు.
డిపోల ముందు ధర్నాలు నిర్వహించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు గంటలపాటు బస్సు సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై అడ్డుకోవడంతో ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. ఉదయం రెండు గంటలపాటు బస్సులు బంద్‌చేసి డిపోల ముందు నిరసన తెలిపిన కార్మికులు, ఉద్యోగులు.. రాజ్‌భవన్ ముట్టడికి బయల్దేరారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపుమేరకు నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో ర్యాలీగా గవర్నర్ అధికార నివాసానికి చేరుకున్నారు. రాజ్‌భవన్ గేటు ముందు కూర్చుని నిరసన తెలిపారు. గవర్నర్ తమిళిసైకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసారు. వెంటనే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేసారు. కాగా, ఆర్టీసీ బిల్లును వెంటనే గవర్నర్ వెంటనే ఆమోదించాలని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బిల్లును కేబినెట్ ఆమోదిం చిందని, సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ చర్యలు చేపట్టాలన్నారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్‌భవన్‌కు పంపించింది.
ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ సమస్యలను ఆంధ్రప్రదేశ్ తీరుగానే పరిష్కరిస్తామని వెల్లడించింది. తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది.
ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ సమస్యలను ఆంధ్రప్రదేశ్ తీరుగానే పరిష్కరిస్తామని వెల్లడించింది. తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కానీ ఆర్టీసీ విలీనం బిల్లుకు రాజ్‌భవన్ మోకాలడ్డుతోంది. సాంకేతికంగా మనీ బిల్లు కావడంతో గవర్నర్ కాన్సెంట్ కోసం రాష్ట్ర సర్కార్ పంపింది. అయితే బిల్లుపై గవర్నర్ పలు అభ్యంత రాలను వెలిబుచ్చారు. బిల్లు ఆమోదానికి తనకు కొంత సమయం కావాలని చెప్పారు. దీంతో సభలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టడానికి అడ్డంకిగామారింది. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవహారశైలికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు జంగ్‌సైరన్ పూరించారు. శనివారం ఉదయం 2 గంటలపాటు బస్సులను నిలిపివేశారు. డిపోల ముందు ధర్నా నిర్వహించారు. గవర్నర్ బంగ్లాను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది.. రాజ్‌భవన్ ముందు బైఠాయించారు. దీంతో రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
గవర్నర్ లేని సమయంలో రాజకీయమా
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఈటల
అసెంబ్లీలో ప్రభుత్వం చిత్తశుద్దిగా లేదు
: ఈటల
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఈటల
అసెంబ్లీలో ప్రభుత్వం చిత్తశుద్దిగా లేదు
: ఈటల
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం
చేయడానికి బీజేపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ విలీనం బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. శనివారం అసెంబ్లీ డియా పాయింట్ వద్ద మాట్లాడుతూ… గవర్నర్ లేని సమయంలో బిల్లు పంపి ఆమోదించడం లేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. బట్ట కాల్చి ద వేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు ఇవ్వలేదని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గుండెల్లో బాధను మర్చిపోలేదన్నారు. మహిళా కండక్టర్లను ఇష్టం లేకపోయినా రాజ్‌భవన్ వద్ద ధర్నాకు పంపుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం సమావేశాలు జరగడం లేదని.. తమ వైపు స్పీకర్ చూడటం లేదని అన్నారు. తాము మాట్లాడితే ఒక వైపు హరీష్‌రావు, కేటీఆర్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయితీ సిబ్బంది జీతాలు రాక ఆందోళన చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు.




