ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలని రాచకొండ సి.పి. డి ఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాచకొండ పోలీస్ కమీషనరేట్ నేరడ్ మెట్ లో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని , మహానుభావుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. రాచకొండ పోలీసులు శాంతిభద్రత మరియు మెరుగైన సేవలు అందించడానికి ముందున్నారన్నారు . పోలీసులు శాంతిభద్రతలు, దేశ సమగ్రత, ప్రజా సేవలో అంకితమవ్వాలన్నరు. కార్యక్రమంలో జాయింట్ సీపీ సత్యనారాయణ, ఎస్బి డీసీపీ బాలస్వామి, క్రైం డీసీపీ అరవింద్, అడ్మిన్ డీసీపీ ఇందిర, అడిషనల్ డీసీపీలు, ఎసిపిలు, మినిస్ట్రీరియల్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.




