ఘనంగా ముదిరాజ్ సంఘం వార్షికోత్సవం

జగదేవపూర్, ప్రజాతంత్ర ఆగష్టు 17: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ టెంపుల్ వద్ద ముదిరాజ్  వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ మండల అధ్యక్షుడు రాగుల రాజు బీసీ రత్న అవార్డు గ్రహీత ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరిoచి ఎల్లమ్మ టెంపుల్ నుండి గాంధీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల ముదిరాజ్ సంఘం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముదిరాజులు  ఐకమత్యంతో ముందుకు సాగాలని, ముదిరాజులు  ఆర్థికంగా ఎదగాలని, ముదిరాజ్ బిడ్డలు వ్యాపార రంగంలో గాని విద్య వైద్య రంగలలో అభివృద్ధి చెందాలని అన్నారు. అదేవిధంగా ముదిరాజులు కలిసికట్టుగా పోరాడి ముదిరాజుల హక్కులు సాధించుకోవాలని అన్నారు.అలాగే ముదిరాజుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రెసిడెంట్ తీగుళ్ల సత్యం, మండల యూత్ ప్రెసిడెంట్ హేమ సురేష్, మండల ముదిరాజ్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నే జయమ్మ,మండల సలహాదారులు బలరాం,సర్పంచులు దండు లావణ్య మల్లేశం, రాజేశ్వరి రవి, పిట్టల రాజు, జగదేవపూర్ మాజీ సర్పంచ్ కొంపల్లి కర్ణాకర్,మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్,ముదిరాజ్ మండల కమిటీ సభ్యులు పిట్టల నర్సింలు, రొయ్యల కర్ణాకర్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి బాలకిషన్,పరమేశ్వర్, వివిధ గ్రామాల అధ్యక్షులు బాలయ్య నరేష్ స్వామి కొండయ్యరమేష్ రాజు సుదర్శన్ జహంగీర్,ఉప సర్పంచ్ మహేష్, నర్సింలు కొంపల్లి మహేష్, మండల నాయకులు దాసు బాలయ్య, జగదేవపూర్ గ్రామ అధ్యక్షులు శ్రీకాంత్, ముదిరాజ్ కుల పెద్దలు పెద్దమల రాజయ్య నర్సింలు కృష్ణ చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *