ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని, విద్యార్థులను విద్యా విజ్ఞాన బోధనతో పాటు సాహిత్య, సాంస్కృతిక, కళా, క్రీడా రంగాలలో అత్యుత్తమ క్రమ శిక్షణతో ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న అధ్యపకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ప్రతిభను, విద్యా సేవా నిరతిని గుర్తించి ఘనంగా సన్మానించి, సత్కరించి వారి ప్రతిభను, విద్యా సేవను ప్రోత్సహించాలనే సదుద్దేశ్యంతో ప్రముఖ సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సేవా సంస్థ ‘సర్వేజనాః సుఖినో భవంతు’ హైదరాబాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించ నున్న టీచర్స్ డేను పురస్కరించుకొని. హైదరాబాద్ లో 10 సెప్టెంబర్ ఆదివారం డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, జాతీయ స్థాయి, ఉపాధ్యాయ రత్న రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల 2023 ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు సర్వేజనాః సుఖినో భవంతు వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ డాక్టర్ ఈఎస్ఎస్ నారాయణ మాస్టర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు గాను పై పురస్కారాల ఎంపికకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, విద్యా సంస్థల, కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధ్యపాకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విద్యా బోధనతో పాటు, కల్చరల్, స్పోర్ట్స్, ఆర్ట్స్, యోగా టీచర్స్ వారి విద్యా అర్హతల, బోధన, శిక్షణ అనుభవాల పూర్తి వివరాలు గల సర్టిఫికెట్స్, ఫోటోలు, పత్రికల క్లిప్పింగ్స్, గతంలో పొందిన అవార్డుల వివరాల జిరాక్స్ కాపీలతో పాటు 4 పాస్ పోర్ట్ సైజు ఫోటోలను ధరఖాస్తుకు జత చేసి ఆగస్ట్ 31 లోపు తమ ఆఫీసు అడ్రస్ సర్వేజనా సుఖినో భవంతు, డోర్ నెం.1-20-164, గోకుల్ నగర్, వెంకటాపురం, పోస్టు: తిరుమలగిరి, సికింద్రాబాద్-15 నకు పంపించాలని కోరారు.



