పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పిహెచ్ సి సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం..రుద్రారం, భానూర్, లక్డారం గ్రామాలలో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టారని తెలిపారు. ప్రధానంగా పల్లె దవఖానాలు, బస్తీ దవాఖానాలు, పి హెచ్ సి లతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు సైతం కార్పోరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఆధునిక వైద్య చికిత్సలతో పాటు ఖర్చుతో కూడుకున్న వైద్య పరీక్ష కేంద్రాలు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పల్లెలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమం నిర్వహించడంతోపాటు లక్షల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు.లక్డారం గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు రెండో విడత గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఆయా గ్రామాల సర్పంచులు సుధీర్ రెడ్డి, సువర్ణ మాణిక్ రెడ్డి, ఎంపీటీసీ రాజు సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



