తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: తాండూరు పట్టణంలో జరుగుతున్న ముర్షద్ దర్గా ఉత్సవాలకు మంత్రి మహేందర్ రెడ్డి ని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల ఆహ్వానించారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయ కార్యాలయంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు & గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వర్యులుగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పట్టణంలో జరుగుతున్న ముర్షద్ దర్గా ఉత్సవాలకు రావాలని జుబేర్ లాల ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రాము, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.



