కొన్ని పార్టీలు డిక్లేరేషన్‌ ‌నాటకాలకు తెరలేపుతున్నారు

  • కేసీఆర్‌ను 3వ సారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌చేశారు
  • మంత్రి హరీష్‌రావు

పాలకుర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : ‌కొంత మంది డిక్లరెషన్లంటూ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని, కాని ముచ్చటగా మూడవ సారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఎప్పుడో సెల్ప్ ‌డిక్లరేషన్‌ ‌చేశారని ఆర్థిక, వైద్యారాగ్యో శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం పాలకుర్తి మండలంలోని వల్మిడిలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ‌పంచాయతిరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, తదితరులతో కలిసి పాలకుర్తిలో రూ,160కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…తాము అభివృద్ధి చేసి వోట్లు అడుగుతున్నామని, ఇతర పార్టీలు అబద్దాలు చెప్పి వోట్లు అడుగుతున్నాయని విమర్శించారు. ఏపార్టీ అధికారంలోకి వొచ్చినా 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దేశంలో రూ.75వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఏకైక ప్రభుత్వ బీఆర్‌ఎస్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌ ‌రైతు పక్షపాతి అన్నారు. అందుకే రైతు రుణమాఫీ చేశారన్నారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలో చేయని పనులను ఇక్కడ చేస్తామని గొప్పలు చెబుతున్నాయని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో మరోసారి ఆధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్సేనన్నారు. కేంద్రంలో కీలక పాత్ర పోషించబోతున్నామని తెలిపారు. తెలంగాణ  ప్రజలకు ఇంటి ముందు అభివృద్ధి, కళ్లముందు అభ్యర్థి ఉన్నాడని తెలిపారు. మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి వొస్తేనే సంక్షేమం కొనసాగుతదన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో పాలకుర్తి ప్రాంతం ఎంతో అబివృద్ధి సాధించిందన్నారు. దేవాదుల నీరు తెచ్చి చెరువులు నిప్పాడన్నారు. ఏ గ్రామాన చూసినా సీసీరోడ్డు వేశారన్నారు. రైతులకు సాగునీరు అందించి ఆదుకునేందుకు అనేక చోట్ల చెకడ్యామ్‌లు నిర్మించారన్నారు. పాలకుర్తి ప్రాంతాన్ని సీఎం కేసీఆర్‌ ఆశిస్సులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారన్నారు.

రాష్ట్రంలో అవార్డుల పంట పండించిన ఘనత ఎర్రబెల్లిదని కొనియాడారు. కేంద్రం నుంచి ఆవార్డులు వొస్తున్నాయంటే గ్రామాల్లో ఎర్రబెల్లి చేసిన అభివృద్ధి, వెనుక ఆయన శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా పనిచేసే నాయకుడు ఎరబ్రెల్లి దయాకరరావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడీయం శ్రీహరి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, శకంరనాయక్‌, ఆరూరి రమేష్‌, ఆరోగ్య శ్రీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌సుధాకర్‌ ‌రావు, జల వనరులు కార్యదర్శి ప్రకాష్‌, ‌జిల్లా చైర్మన పాగాల సంపత్‌, ఎం‌పీపీ నల్లా నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరావు, పసూనూరి నవీన, జెడ్పీకోఅప్షన్‌ ‌మెంబర్‌ ఎం‌డీ మదార్‌, ఎ‌ర్రబెల్లి రాఘవరావు, కక్కిరాల హరిప్రసాద్‌, ‌ముస్కు రాంబాబు,  ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *