ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 16: బీఆర్ఎస్ పాలనతో ప్రజాస్వామ్యానికి జబ్బు చేసిందని, ఓటుతో నయం చేసి, కేసిఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసి, సోనియా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. గురువారం చైతన్యపురి డివిజన్లో యోగా శిక్షణ కేంద్రాన్ని మధు యాష్కీ గౌడ్ సందర్శించారు. అనంతరం అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మధుయాష్కీ మాట్లాడుతు మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన నియోజకవర్గం ఆరోగ్యంగా ఉండటం అంతే ముఖ్యమని అన్నారు. మన దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి జబ్బు చేసిందని, దానికి ఓటు అనే మాత్రలు వేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు విసిగెత్తి ఉన్నారని ఆ పార్టీకి చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓట్లతో బుద్ధి చెప్పాలిని కోరారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించండి మధుయాష్కి గౌడ్





