ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: వైశ్యులందరినీ ఒక ప్లాట్ ఫామ్ మీదకి తీసుకురావడమే అంతర్జాతీయ వైశ్య4 ఫెడరేషన్ ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. ఆదివారం ముషీరాబాద్ వాసవి హాస్టల్లో నూతన సంవత్సర అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ రాబోయే 2024 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న ఆర్య వైశ్యులందరినీ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పేద వైశ్యులను ఆదుకోవడానికి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది అని ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అదేవిధంగా దేశంలో ఉన్న 16 కోట్ల మంది వైశ్యులందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ముందుంటుందన్నారు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయపరంగా సేవాపరంగా దేశంలో వైశ్యులందరినీ రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి అన్ని పార్టీలలో సముచిత స్థానం కల్పించడానికి ఐవీఎఫ్ ముందు ఉంటదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేద ఆర్యవైశ్యుల కోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గంజి రాజమౌళి గుప్తా మాట్లాడుతూ 33 జిల్లాల్లో పేద వైశ్యులకు చదువుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి ఐవీఎఫ్ ముందు ఉంటదని అన్నారు. అదేవిధంగా ముషీరాబాద్ వైశ్యా హాస్టల్లో పేద వైశ్య స్టూడెంట్స్ కోసం చదువులో మెరిట్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ తో వైశ్య హాస్టల్ లో జాయిన్ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆర్యవైశ్యులందరూ కూడా వ్యాపారంతో పాటు రాజకీయపరంగా కూడా ఎదగాలన్నారు. మహిళా అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు, తాంబూలా కార్యక్రమం, ఆటలు పాటలతో మహిళా మణులు అందరినీ సంతోషపరిచే విధంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ సభ్యులు, కక్కిరాల రమేష్, గట్టు మహేష్, పబ్బ చంద్రశేఖర్, లెఫ్టినంట్ కల్నల్ రమేష్, ముత్యాల సత్తయ్య, ఉప్పల స్వప్న, మిడిదొడ్డి శైలజ, యువజన సంఘం అధ్యక్షుడు కట్ట రవి, కటకం శ్రీనివాస్, కొడిపాక నారాయణ, గట్టు మహేష్, ఉడుతా పురుషోత్తం, కాచం కృష్ణమూర్తి, మేఘ మాల, జయశ్రీ, సరిత, నరేష్ గుప్తా, శ్రీధర్ గుప్తా, కోటేశ్వరరావు, వీరేందర్, నర్సింగరావు, దామోదర్ శెట్టి, శ్రీనివాస్, ఆంజనేయ స్వామి, సరాపు సంతోష్, ఎల్ వి కుమార్, వివిధ జిల్లాల నుండి మహిళా జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర కమిటీ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
పేద వైశ్యులను ఆదుకోవడానికి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది ఉప్పల శ్రీనివాస్ గుప్తా





