ఇందిరా గాంధీ కన్న కలలను సాధించుకుందాం

సిద్దిపేటలో 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
పార్టీ జెండా ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి
సిద్ధిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 28: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కన్నా కలలను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాధించుకుందామని సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేటలో గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను డిసిసి అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇందిరాగాంధీ కుటుంబం కన్న కలలను త్వరలోనే తెలంగాణలో అమలు చేసుకుందామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ధనిక రాష్ట్రమని చెప్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్ళి ప్రజల నెత్తిపై పెను భారాన్ని మోపారని అన్నారు. అనవసరపు ఖర్చులతో రాష్ట్రాన్ని ఆగం పట్టించాలని త్వరలోనే ఆ కుటుంబం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్, గంప మహేందర్, ముద్ధం లక్ష్మి, జీవన్ రెడ్డి, వంటేరు నరేందర్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, మార్క సతీష్ గౌడ్, దాసరి రాజు, గయాజుద్దీన్, మజార్ మాలిక్, మధు, రాశేద్, వహాబ్, అజ్మత్, హర్షద్, కాజా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *