ఫోన్‌ ట్యాపింగ్‌లో కాంగ్రెస్‌ నేతలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నోటీసులు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరువునష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ నాయకులను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖతోపాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌ రెడ్డికి కేటీఆర్‌ నోటీసులు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *