రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదు

  • వినియోగం పెరగడంతో అవాంతరాలు
  • ఫోన్‌ ట్యాపింగ్‌పై మౌనమెందుకు?
  •  కేసీఆర్‌ అసెంబ్లీకి వొస్తే అన్నీ చర్చిస్తాం
  • మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది..అది నేను ముందే చెప్పా
  • నీళ్లను సముద్రంలోకి విడిచిన గత ప్రభుత్వం..
  • ఆ నీళ్లకు కరెంట్‌ బిల్లు కట్టాం: 
  • మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌

న్యూదిల్లీ, మే 28 : రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే విద్యుత్‌ వినియోగం పెరగడంతో సరఫరాలో కొన్నిచోట్ల అవాంతరాలు ఏర్పడుతున్నాయన్నారు. దిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడిస్తూ…చీటికి మాటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులు, ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ర్రపశ్నించారు. ఎందుకు సీబీఐ విచారణ కోరలేదన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయలేదని, ఆ అవసరం తమకు లేదన్నారు. ట్యాపింగ్‌ లాంటి వెధవ పనులు తాము చేయమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి వొస్తే అవన్నీ చర్చిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ఆంధప్రదేశ్‌లో అనేక విమర్శలు, ఆరోపణలతో అధికారుల బదిలీలు జరిగాయన్నారు.

తెలంగాణలో అలాంటి ఆరోపణలకు ఏమాత్రం తావులేకుండా ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిఫుణులు చెప్పింది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దాని ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు. అత్యంత పాదర్శకంగా తమ పాలన సాగుతుందన్న సీఎం రేవంత్‌, ఈ విషయంలో ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం లేదన్నారు. తెలంగాణ గేయానికి సంబంధించిన పనులను వేరేవాళ్లకు అప్పగించడంపై వొస్తున్న విమర్శలపై సిఎం మాట్లాడుతూ…తెలంగాణ గేయానికి సంబంధించిన పనులను అందెశ్రీ అప్పగించామన్నా రు. ఎవర్ని తీసుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం రూపకల్పన రుద్ర రాజేశంకి ఇచ్చామన్నారు. తెలంగాణ అంటే రాచరికానికి వ్యతిరేకమని, త్యాగాలు పోరాటాలు గుర్తుకు వొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని తెలియజేశారు. మిగతా విషయాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు సీఎం. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది అని తాను ముందే చెప్పానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నీళ్లను సముద్రంలోకి విడిచారని, ఆ నీళ్లకు కూడా కరెంట్‌ బిల్లు కట్టామని చెప్పారు. మరోవైపు..రాష్ట్రంలో తన పాలన అత్యంత పారదర్శకంగా సాగుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం కూడా ఇవ్వడంలేదని చెప్పారు.







 

తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించామన్నారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందే శ్రీ నిర్ణయనికే వదిలేశామని చెప్పారు. రాజముద్ర రూపకల్పనకు బాధ్యత ఇచ్చింది ఫైన్‌ ఆర్ట్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌కు అని, ఆయన నిజామాబాద్‌ బిడ్డ అని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రం ఆంధప్రదేశ్‌లో అంత హింస జరిగిన తెలంగాణలో ఒక్క ఘటన కూడా చోటు చేసుకోలేదు.. రాజకీయ ప్రత్యర్ధులు సైతం విమర్శించడానికి వీలు లేకుండా పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేశామన్నారు. తాము అధికారంలోకి వొచ్చాక ఎన్నో వేడుకలు జరిగాయని..ఎక్కడ హింసకు తావు లేకుండా శాంతి భద్రతలు చూసుకున్నామని పేర్కొన్నారు. జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం అందిస్తున్నామని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరంపై సాంకేతిక నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్తామని సీఎం పేర్కొన్నారు. జ్యూడీషియల్‌ విచారణ మూడు బ్యారేజీలకే పరిమితమని.. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్లపై న్యాయ విచారణ జరుగుతుందన్నారు. నివేదిక తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *