two ministers: ఇద్దరు మంత్రులు సహా ఎనిమిదిమంది దుర్మరణం

– ఘనాలో కూలిపోయిన హెలికాప్ట‌ర్‌

ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియా దేశం ఘనా(Ghana)లో హెలికాప్టర్‌ కూలి ఇద్దరు మంత్రులతోపాటు ఎనిమిదిమంది దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. జెడ్‌-9 యుటిలిటీ(Z-utility) హెలికాప్టర్‌ బుధవారం ఉదయం రాజధాని అక్రా నుంచి బయలుదేరి అశాంతి ప్రాంతంలోని బంగారు గనుల ప్రాంతమైన ఒబువాసి వైపు వెళ్తుండగా రాడార్‌నుంచి హెలికాప్టర్‌ మాయమైంది. హెలికాప్టర్‌లో రక్షణ మంత్రి ఎడ్వర్డ ఒమనే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తళా ముహమ్మద్‌తోపాటు అధికార జాతీయ డెమోక్రాటిక్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, ఓ సినయర్‌ భద్రతా సలహాదారు, హెలికాప్టర్‌ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్‌ కూలిపోవడంతో వారంతా కాలి బూడిదయ్యారు. రెస్క్యూ టీమ్‌ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనను అక్కడి ప్రభుత్వం జాతీయత విషాదంగా పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *