గోదావరిఖని, ప్రజాతంత్ర, జనవరి 24: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు రామగుండం. కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట శనివారం లొంగిపోయారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని, కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ధర్మాజీ శ్రీకాంత్ (33), పొడియం కాములు (30), ముడియం జోగ (25), కుంజం లక్కె (23), మోదం భీమ (30), కుంజం ఉంగా (28), ముడికం సుక్రం (25), ముడియం మంగు (50). అనంతరం రామగుండం సీపీ మాట్లాడుతూ పోరు వద్దు ఊరు ముద్దు అని ప్రజస్వామ్య యుతంగా పోరాడాలని కోరారు. అజ్ఞాతం లో ఉన్న అదిలాబాద్, కరీంనగర్ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరారు. ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి అని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్ లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, ఆర్ ఐ శేఖర్, ఆర్ ఎస్ ఐ లు వెంకట్, శివ, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





