హైదరాబాద్, ఆగస్ట్ 30 : సిఎం కె.చంద్రశేఖర్ రావు దార్శనికత మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గత 8 సంవత్సరాలలో అద్భుతమైన విజయాలు సాధించింది. రాష్ట్ర అవతరణ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి రూ.5072 కోట్ల 76 లక్షలు ఆదాయం సమకూరింది. 98 ఇసుక రీచులను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని సహజవనరుల అన్వేషణ, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ని నేషనల్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీగా గుర్తించిన కేంద్ర గనుల మంత్రిత్వశాఖ తెలంగాణాతో పాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 10 మైనింగ్ అన్వేషణ ప్రాజెక్టు పనులు పూర్తిచేసింది. టిఎస్‌ఎండిసి లిమిటెడ్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వం యొక్క పూర్తి రాష్ట్ర యాజమాన్యంతో నడుస్తున్న ఐఎస్‌ఓ 9001:2015 సంస్థ. తెలంగాణ కోటి ర•నాల సీమ అని వెల్లడిస్తున్న సంస్థ అన్వేషణతో సహా ఖనిజ వనరుల అభివృద్ధి, ఖనిజ వనరుల గుర్తింపు, ప్రయోజనకరంగా వాటిని వెలికితీయడం ఈ కార్పొరేషన్ యొక్క ప్రధాన ఉదేశ్యం. ఖనిజ పరిశ్రమల అభివృద్ధి భాగస్వామ్యం కావడంతో పాటు ప్రైవేట్ ఖనిజ వనరుల అభివృద్ధికి అత్యుత్తమ సాంకేతికతను అందించి పెట్టుబడిని సమకూర్చుటకు సంస్థ కృషి చేస్తున్నది. 5 జనవరి 2016న టిఎస్‌ఎండిసిని నేషనల్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ప్రస్తుతం సంస్థ..98 ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్‌లో 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి గనిని ఓరియంట్ సిమెంట్స్ లిమిటెడ్‌కు కాంట్రాక్టుకు ఇచ్చింది. సూర్యాపేట జిల్లాలో గ్రానైట్ రైజింగ్ కమ్ సేల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 9.90 హెక్టార్ల విస్తీర్ణంలోని బ్లాక్ గ్రానైట్ క్వారిని లీజుకు ఇవ్వడం జరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 27.07.2022 వరకు ఇసుక అమ్మకాలపై వొచ్చిన ఆదాయం రూ.5072.76 కోట్లు. సంస్థ పైప్ లైన్‌లోని ప్రాజెక్‌ల వివరాలు : కరీంనగర్ జిల్లా, శంకర్ పట్నం మండలం, కొత్తగట్టు గ్రామంలో డైమెన్షనల్ స్టోన్ గ్రానైట్ క్వారీల కోసం అన్ని చట్టబద్ధమైన అనుమతులను పొందింది. రంగారెడ్డి జిల్లా యాచారం(266 హెక్టార్లు), బండరావిర్యాల(26.88 హెక్టార్లు)లో రోడ్డు మెటల్ క్వారీల కోసం రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు క్వారీ లీజులను మంజూరు చేసింది. రావిర్యాల విషయానికొస్తే, తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్‌కు సొంతంగా 33.22 ఎకరాల్లో మైనింగ్ చేపట్టేందుకు అనుమతినిచ్చింది. వడ్డెర సొసైటీల ద్వారా మిగిలిన 33.23 ఎకరాలలో సంస్థ చట్టబద్ధమైన అనుమతులు పొందుటకు ప్రయత్నిస్తున్నది. యాచారం రోడ్డు మెటల్ క్వారీ కోసం 39 ఎకరాల విస్తీర్ణంలో రోడ్డు మెటల్ యూనిట్ ఏర్పాటు కోసం అన్ని చట్టబద్ధమైన అనుమతులను సంస్థ పొందింది. క్వార్టజ్ మరియు ఫెల్డ్‌స్పార్స్- సంస్థ క్వార్టజ్ ఖనిజం వెలికితీయుటకు దరఖాస్తు చేసింది. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో 195.288 హెక్టార్ల విస్తీర్ణంలో మొత్తం 07 దరఖాస్తులకు ఫెల్డ్‌స్పార్స్ క్వారీ లీజు కొరకు పిసిసిఎఫ్ కార్యాలయం నుంచి టిఎస్‌ఎండిసి అనుమతి పొందింది. అలాగే గుండ్యాల రేంజ్ ఫారెస్ట్ ఏరియాలలోని 314, 315. 316 %•% 317 కంపార్ట్‌మెంట్ నుండి నమూనాలను సేకరించింది. ఇంకా, డిజిపిఎస్‌తో సర్వే చేయబడిన ప్రాంతాలు గుర్తించబడ్డాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న క్వారీ లీజులన్నీ ప్రాసెస్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లోని యెల్లందు ప్రాంతం చుట్టూ ఉన్న మార్బుల్ డిపాజిట్ల మూల్యాంకనం ప్రక్రియను సంస్థ చేపట్టింది. సున్నపురాయి వెలికి తీయుటకు తెలంగాణ ప్రభుత్వం ప్రాస్పెక్టింగ్‌ను ఈ క్రింది ప్రాంతాల్లో మంజూరు చేసింది..880 హెక్టార్ల లీజును మంచిర్యాల జిల్లాలోని ర్యాలీ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం మరియు 974 హెక్తర్లలో మంచిర్యాల డివిజన్‌లోని ర్యాలీ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో మరొక చోట ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సంస్థ యొక్క అన్వేషణ ప్రాజెక్టులు : తెలంగాణ, ఒడిశా మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ ద్వారా నిధులు సమకూర్చబడిన మొత్తం పది (10) రికనైసెన్స్. స్టేజ్ (జి-4 స్థాయి) సున్నపురాయి అన్వేషణ ప్రాజెక్టులను సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. పది సున్నపురాయి అన్వేషణ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సంస్థకు ఎన్‌ఎంఇటి రూ. 3.80/- కోట్లు పంపిణీ చేసింది. పది అన్వేషణ ప్రాజెక్టులలో ఎనిమిది (08) సున్నపురాయి అన్వేషణ ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి, మొత్తం వైశాల్యం-276.83 చదరపు కిలోమీటర్లు సూర్యాపేట, నల్గొండ మరియు వికారాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. రూ.3.4 ఎన్‌ఎంఇటి మంజూరు చేసిన నిధులతో రెండు అన్వేషణ ప్రాజెక్టులలో ఒకటి పురోగతిలో ఉంది. మాంగనీస్ అన్వేషణ ఆదిలాబాద్ జిల్లా, భీంపూర్ మండలం, పింపర్కుంట బ్లాక్‌లో మాంగనీస్ ఖనిజం కోసం రూ.157.22 అంచనా వ్యయంతో 48.80 హెక్టార్లులో సాదారణ అన్వేషణ పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ స్థితి : సర్వేయింగ్, జియో-ఫిజికల్ స్టడీస్, సర్ఫేస్ జియోలాజికల్ మ్యాపింగ్, బేస్‌లైన్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ మరియు కోర్ డ్రిల్లింగ్ వర్క్ పూర్తయ్యాయి. అయితే రసాయన విశ్లేషణ నివేదిక రావలసి ఉంది. జియోలాజికల్ నివేదికను టిఎస్‌ఎండిసి సిద్ధం చేస్తున్నది. కరీంనగర్, సిద్దిపేట జిల్లాలోని తెలంగాణ 350 చ.కి.మీ విస్తీర్ణంలో రూ. 1 కోటి 73 లక్షలువ్యయంతో వివిధ మినరల్స్ అన్వేషణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ అన్వేషణ పనుల్లో భాగంగా చేపట్టిన ఉపగ్రహ చిత్రాల అధ్యయనం పూర్తయింది. జియోలాజికల్ మ్యాపింగ్, జియో-ఫిజికల్ మరియు కోర్ డ్రిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. జియోలాజికల్ నివేదికను సిద్ధం చేస్తుంది. టిఎస్‌ఎండిసి సంస్థ దేశంలోనే ఉత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఐఎస్‌ఓ 9001:2015 నుండి మేనేజ్‌మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ పొందింది.
సిస్టమ్ (ఆన్‌లైన్ సిస్టమ్) ఇ-ఆఫీస్ ఫైల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఇసుక అమ్మకాలు జరుపుతున్నది. వివిధ జిల్లాలు మరియు హైదరాబాద్ నగర నిర్మాణ అవసరాలను తీర్చడానికి హైదరాబాద్ నగరం చుట్టూ అబ్దుల్లాపూర్‌మెట్, వట్టినాగులపల్లి మరియు బోరంపేటలో ఇసుక సబ్ స్టాక్‌యార్డ్‌లతో సహా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో సబ్ స్టాక్‌యార్డుల ఏర్పాటు చేసింది. ఒరాకిల్ ఇబిఎస్ – ఇఎస్‌పి అనేది ఒరాకిల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అన్ని డిపార్ట్‌మెంట్‌ల అవసరాలు సంబంధిత కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి ఫిబ్రవరి, 2020 నుండి సంస్థ అమలు లోకి తెచ్చింది. ఈ మాడ్యూల్స్ ఒరాకిల్ ఇఆర్‌పిలో పొందుపరచబడ్డాయి. మానవ వనరుల నిర్వహణ వ్యవస్థలైన..అమ్మకాలు మరియు కొనుగోళ్లు, ఫైనాన్స్ మరియు అకౌంటింగ్, ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహణ, ఇన్వెంటరీ నిర్వహణ, ఎంటర్‌ప్రైజ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లను సంస్థ ఏర్పాటు చేసింది. ఇసుక విక్రయ కార్యకలాపాలపై సమాచారాన్ని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అందిస్తుంది. ఇసుకలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించే లక్ష్యంతో టెలి హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇసుక రవాణా మరియు ధర సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంస్థ అందిస్తుంది. ఇసుక విక్రయం మరియు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్దతో పనిచేస్తుంది. సిసిటివి కెమెరాలు మరియు సెంట్రల్ మానిటరింగ్ ద్వారా ఇసుక రీచులపై నిఘా ఏర్పాటు చేసింది. 70 కంటే ఎక్కువ రీచ్‌లు 24/7 ఐపి ఆధారిత సిసి కెమెరాల ద్వారా సంస్థ ప్రధాన కార్యాలయంలో లైవ్ స్ట్రీమింగ్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్‌తో పర్యవేక్షించబడుతున్నాయి. సంస్థ ద్వారా తూనికల వంతెనల ఏర్పాటు చేయబడినాయి. టిఎస్‌ఎండిసి స్కాచ్ గ్రూప్ నుండి డిజిటల్ ఇండియా గోల్డ్ అవార్డు అందుకుంది, ఇది ఇసుక విక్రయ నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ కోసం భారతదేశం యొక్క అత్యున్నత స్వతంత్ర పౌర పురస్కారాలను స్కాచ్ స్థాపించింది. డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్-ఇసుక సేల్ మేనేజ్‌మెంట్ మరియు మానిటరింగ్ సిస్టమ్ కోసం ఆసియా మరియు మిడిల్ ఈస్ట్‌లోని ప్రీమియర్ టెక్నాలజీ మరియు మీడియా రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయిన ఎలెట్స్ టెక్నోమీడియా నుండి అవార్డును టిఎస్‌ఎండిసి అందుకుంది.


