– ఏడుగురి సజీవ దహనం
జయపుర, ఫిబ్రవరి 16: రాజస్థాన్‌లో భివాడీలోని ఓ రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్త చర్యగా సవిÖపంలోని కర్మాగారాల్లో పనిచేస్తున్న వారిని ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం కాగా వారి మతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు పేర్కొన్నారు. మరికొందరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో కర్మాగారంలో ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదంలో రూ.లక్షల విలువ చేసే వస్తువులు, యంత్రాలు బూడిదయ్యాయన్నారు. ఫ్యాక్టరీలో నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అగ్ని ప్రమాదంలో ఏడుగురు మతిచెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





