75వ యేట సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం.. భారత్‌

దినోత్సవ సమ్నరాలు నిర్వహిస్తారు. దేశరాజధాని ఢల్లీిలోలో రాష్ట్రపతి ప్రధాన వ్యక్తిగా అత్యంత అద్భుతంగా వేడుకలు జరుగుతాయి. ఢల్లీి రాజ్‌ఘాట్‌లో భారీ కవాతు నిర్వహిస్తారు. భరత సైన్యానికి చెందిన వివిధ బలగాలు, రెజిమెంట్లు రాష్ట్రపతి భవన్‌ సమీపంలోని రైసినా హిల్‌ నుండి రాజ్‌పథ్‌ వెంట అధికారిక యూనిఫారంలో కవాతు చేస్తు ఇండియా గేట్‌కు చేరుకుని, భారత రాష్ట్రపతికి వందన సమ్ప్రణ చేస్తారురు. రాష్ట్రపతి జాతీయ జెండా ఆవిష్కరించడంతో పాటు జాతీయ గీతం ఆలపించి, 21 తుపాకులు పేల్చి వందనంతో వేడుక ప్రారంభమవుతుంది.

స్వాతంత్య్ర ఉద్యమంలో దేశాన్ని, దాని సార్వభౌమత్వాన్ని కాపాడుతూ అనేక యుద్ధాలలో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ నివాళులు అర్పించేందుకు ఇండియా గేట్‌ వద్ద అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద భారత ప్రధాని పుష్పగుచ్ఛం ఉంచుతారు. సాయుధ దళాల నుండి అర్హులైన సైనికులందరికీ శౌర్య పతకాలు, వీర్‌ చక్ర, పరమ వీర్‌ చక్ర, మహా వీర్‌ చక్ర ప్రదానం చేస్తారు. తీవ్రప్రతికూల పరిస్థితుల్లో అసాధారణ ధైర్యం, పరాక్రమం ప్రదర్శించిన పౌరులు, పిల్లలకు కూడా పతకాలు అందజేస్తారు. కవాతు అనంతరం దేశవ్యాప్తంగా రాష్ట్రాల నుంచీ తరలివచ్చే అద్భుతమైన శకటాల ప్రదర్శన సాగుతంది. ప్రతి రాష్ట్ర జీవనశైలి, సంస్కృతి, సాధించిన విజయాలు ప్రతిబింబించే దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన జానపద పాటలు, సంగీతం, నృత్యం వాటిలో భాగాలు. దేశంలోని వైవిధ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పే సందర్భమిది.

 

భారత రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల గురించి చర్చించిన తర్వాత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విదేశీ ప్రముఖులను ఎంపిక చేయడం 1950 నుంచీ వస్తున్న సాంప్రదాయం. . జనవరి 29 సాయంత్రం రిపబ్లిక్‌ డే ఉత్సవాల ముగింపుగ బీటింగ్‌ రిట్రీట్‌ నిర్వహిస్తారు. భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా సాయుధ దళాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తాయి. ముంబైలోని శివాజీ పార్క్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌బీ బెంగుళూరులో, ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షా పరేడ్‌ గ్రౌండ్‌లో కవాతుబీ కోల్‌కతాలో మైదాన్‌ సమీపం రెడ్‌ రోడ్‌లో సంస్కృతి ఉత్సవం జరుగుతుంది. చెన్నైలో రిపబ్లిక్‌ డే పరేడ్‌ వేడుకలకు కామరాజ్‌ సాలై, మెరీనా బీచ్‌ వేదికలు. అన్ని రాష్ట్రాల్లో వేడుకలు అత్యంత భద్రతా చర్యలమధ్య రిపబ్లిక్‌ ఉత్సవాలు జరుగుతాయి. వైమానిక దళ విమానాల ఏరోనాటిక్‌ ప్రదర్శన కూడా ఒక భాగం. భారతీయ వైమానిక దళానికి చెందిన జెట్‌ విమానాలు వేడుక ముగింపును సూచిస్తూ ప్రేక్షకులపై గులాబీ రేకులను కురిపిస్తూ రంగుల పొగల సోయగాలు వెదజల్లుతాయి. దేశం నలుమూలల నుండి విశిష్టమైన ఎన్‌ సి సి కేడెట్లు కవాతులో పాల్గొంటారు.

భారత రాజ్యాంగ ప్రాముఖ్యత

భారత దేశానికి ఇది సర్వోత్కృష్ఠ చట్టం. రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది

.రాజకీయ న్యాయమనగా సమానంగా, స్వేచ్ఛగా, న్యాయంగా అవకాశాలు ప్రజలకు కల్పిస్తూ వారిని రాజకీయాలలో పాల్గొనేలా చేయడం. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా రాజకీయ హక్కులు ప్రదానం చేయటమే లక్ష్యం. భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ రాజకీయాల్లో పాల్గొనే హక్కును, స్వేచ్ఛను అందించే ఉదార ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నది. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక, 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. పౌరులకు, భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి కింది వాటిని సూత్రీకరించింది.

రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు. రాజ్యాంగంపై సంతకాలు చేసే రోజున బయట చిరుజల్లు పడుతూండడాన్ని శుభ శకునంగా భావించారు.

భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక, 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన మహా గ్రంథమిది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించి, పౌరులకు, భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఈ విషయాలు సూత్రీకరించింది:

ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంబీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థబీ బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థబీ ప్రాథమిక విధులుబీ భారత రాజ్యాంగం – ప్రాథమిక హక్కులుబీ ఆదేశ సూత్రాలుబీ ద్విసభా విధానంబీ భాషలుబీ వెనుకబడిన సామాజిక వర్గాలు అంతూ వివరించింది. అవసరమైనపుడు రాజ్యాంగాన్ని సవరించుకోడానికి వెసులుబాటు కలిగిస్తూ, సవరణ విధానాన్ని కూడా నిర్దేశించింది.

రాజ్యాంగ పరిషత్‌ ను ఏర్పాటు చేసారు. ఈ సభలో సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. సభ్యుల నిర్ణయం ప్రాతిపదికలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నికైన సభ్యులు: 292, భారత్‌ సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు: 93, ఛీఫ్‌ కమిషనర్‌ ప్రావిన్సుల ప్రతినిధులు: 4 కలిపి మొత్తం సభ్యుల సంఖ్య 389 అయింది. అయితే మౌంట్‌బాటెన్‌ 1947 జూన్‌ నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం పాత పార్లమెంటు భవనపు సెంట్రల్‌ హాలులో 1946, డిసెంబర్‌ 9 న జరగగా, 211 మంది సభ్యులు హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలు. సచ్చిదానంద సిన్హా సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, సర్దార్‌ పటేల్‌, ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్ర ప్రసాద్‌, సరోజినీ నాయుడు, రాజాజీ, బి.ఆర్‌.అంబేద్కర్‌, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య మొదలైన వారు ఈ సభలో సభ్యులు. 1947 ఆగష్టు 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై, కచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసన సభగా అవతరించింది. రాజ్యాంగం రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. బి.ఆర్‌.అంబేద్కర్‌ ఈ కమిటీకి అధ్యక్షుడుగా ఉన్నారు.

రాజ్యాంగానికి మొత్తం 105 సవరణలు

1951లో మొదటి సవరణ చేసినప్పటి నుండి భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు 105 రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం పొందాయి. 105వ రాజ్యాంగ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర జాబితాలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులను పేర్కొనడానికి రాష్ట్రపతికి అధికారం కల్పించడానికి ఆర్టికల్‌ 342 ఆని సవరించింది.

-నందిరాజు రాధాకృష్ణ, వెటరన్‌ జర్నలిస్ట్‌, 98481 28215 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *