ఆర్టీసికి 65 కొత్త ఎలక్ట్రిక్‌ ‌బస్సులు

– కాలుష్య నివారణ లక్ష్యంగా కృషి
– బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం 

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబర్‌ 10:  ‌రాష్ట్రంలో ఎలక్ట్రి ‌బస్సుల  సంఖ్యను గణనీయంగా పెంచుతూ, ఆర్టీసీని కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హా ఇచ్చారు. రాణిగంజ్‌ ఆర్టీసీ డిపోలో 65 కొత్త ఎలక్ట్రిక్‌ ‌బస్సులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 810 ఎలక్ట్రి ‌బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఇందులో జంట నగరాల పరిధిలో 300కు పైగా బస్సులు తిరుగుతున్నాయి. జనవరి చివరి నాటికి మరో 175 ఎలక్ట్రి ‌బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అత్యాధునిక ‘పీఎం ఈ-డ్రైవ్‌’ ‌పథకం కింద అతి త్వరలో ఏకంగా 2,800 కొత్త ఎలక్ట్రి ‌బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పక్రియ దశలవారీగా ఒకటి లేదా రెండు సంవత్సరాలలో పూర్తవుతుందని మంత్రి తెలిపారు. ఆర్టీసీ రవాణా వ్యవస్థను ఈవీ బస్సుల ద్వారా ముందుకు తీసుకువెళ్లి, హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను విస్తరించడంలో భాగంగా త్వరలో 373 కొత్త ప్రాంతాలకు బస్‌ ‌కనెక్టివిటీని అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఇంటర్‌ ‌సిటీ ట్రాన్స్‌పోర్టేషన్‌ ‌కింద వరంగల్‌, ‌ఖమ్మం, నల్గొండ వంటి చుట్టుపక్కల జిల్లాల నుండి హైదరాబాద్‌కు ఈవీ బస్సులను ప్రారంభం చేసినట్లు ఆయన వివరించారు. గ్రాణ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బస్సుల విస్తరణ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మహాలక్ష్మి పథకం అమలు ద్వారా ఆర్టీసీ వ్యవస్థ లాభాల బాట పట్టిందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇస్తూ, వారి సమస్యలన్నీ అతి త్వరలో పరిష్కారమవు తాయని హా ఇచ్చారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్‌, ‌కండక్టర్‌, ‌శ్రామిక్‌, ఇతర సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని.. వారందరికీ అభినందనలు చెప్పారు. ఇప్పటికీ 251 కోట్ల మంది మహిళలు.. రూ.8,500 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారన్నారు. హాస్పిటల్స్, ‌దేవాలయాలు, ఉద్యోగులు, బంధువుల ఇంటికి, స్కూళ్లకు రాకపోకలు సాగించారన్నారు. దేవాదాయ శాఖ ఆదాయం మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిందన్నారు. రెండేళ్లలో ప్రస్తుతమున్న 40శాతం బస్సులను కొనుగోలు చేయడం జరిగిందని, ఆర్టీసీలో కొత్త రక్తం వస్తుందన్నారు. కొత్తగా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్స్ ‌వస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానుల చేసిందన్నారు. ఢిల్లీ లో నివాస యోగ్యం లేకుండా కాలుష్యం ఉన్న పరిస్థితి ఉందని, ఇక్కడ అలాంటి పరిస్థితి రాకుండా రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రా ‌పాలసీ తీసుకొచ్చిందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుందన్నారు. పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఈవీ బస్సులు సమ్మక్క సారలమ్మ జాతర, శ్రీశైలం, యాదాద్రికి రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రత్యేక బస్సులు బస్సులు, నూతన బస్‌ ‌డిపోల ఏర్పాటు, బస్‌ ‌స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. 1932లో ప్రారంభించిన ఆల్బియన్‌ ‌బస్సు, మధ్యలో వచ్చిన ఎర్రబస్సు, ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్‌ ‌బస్సు అక్కడ ఎగ్జిబిషన్‌ ‌పెట్టినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బందులు వచ్చినా దగ్గరలో ఉన్న ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపినట్లు చెప్పారు. ప్రజారవాణాలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని.. ఈవీ బస్సుల ప్రారంభోత్సవంతో నగరంలో మరింత మెరుగ్గా బస్సులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఈవీ పాలసీని తీసుకువచ్చామని.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ఆటోలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా నగర ప్రజలకు మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *