6 గ్యారంటీల ప్రచారంలో దూసుకెళ్తున్న బాలంపేట్ కాంగ్రెస్ పార్టీ

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 23: ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బలంపేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ…..తుక్కుగూడ లోని కాంగ్రెస్   పార్టీ విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల గురించి గురువారం  స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులతో కలిసి గడపగడపకు తిరుగుతూ వివరించారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాలు ప్రసన్న రెడ్డి స్థానిక , కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు  కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *