– శివారులో భారీగా గంజాయి పట్టివేత
– 6కోట్ల విలువ ఉంటుందని అంచనా
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30: మత్తుపదార్థాల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని సరఫరా చేసే వారు కొత్త మార్గాలలో వెళుతున్నారు. సిమెంట్ బ్యాగుల మాటున గంజాయిని సరఫరా చస్తూ పట్టుబడ్డారు. దుండగులు ఎక్కడో ఓచోట అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా కొనసాగిస్తూ భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు తీసుకున్న మాదకద్రవ్యాల వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఈగల్ టీమ్ పోలీసులు ఇతర అధికారుల సహకారంతో కలిసి ముమ్మరంగా తనిఖీలు చేస్తూ మాదకద్రవ్యాల రవాణాను చాల వరకు అడ్డుకున్నారని చెప్పవచ్చు. ఈ మేరకు ఈగల్ టీమ్ చేపట్టిన దాడుల్లో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరోసారి అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ కొత్తగూడ వద్ద తనిఖీ చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దుండగులు అతి తెలివితో డిసిఎం వ్యానులో సిమెంట్ బ్యాగుల చాటున గంజాయి దాచినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా డిసిఎంను తనిఖీ చేయగా సిమెంట్ బ్యాగుల మధ్య 1210 కిలోల గంజాయిని గుర్తించినట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయిని, డిసిఎంను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




