6వ వార్డు అభివృద్ధికి కృషి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని 6వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అవార్డు కౌన్సిలర్ దివ్య శ్రీకాంత్ సింగ్ అన్నారు. బుధవారం  15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చైర్మన్ రాంపాల్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. రూ.2 లక్షల తో 100 మీటర్ల పైప్ లైన్ ను అనసూయ ఇంటి నుండి మున్నూరు వెంకటేష్ ఇంటి వరకు  చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో  కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *