6‌న అసెంబ్లీలో బడ్జెట్‌…8‌న పద్దులపై చర్చ

  • ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు
  • నేడు గవర్నర్‌ ‌ప్రసంగంపై చర్చ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఈ నెల 6న ఆర్థిక మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు బిఎసి సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై స్పీకర్‌ ‌పోచారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సమావేశాల నిర్వహణపై చర్చించారు. శనివారం గవర్నర్‌ ‌ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేపట్టాలని నిర్ణయించారు. 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.

8న బడ్జెట్‌, ‌పద్దులపై చర్చించనున్నారు. 25 రోజుల పాటు బ్జడెట్‌ ‌సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో కాంగ్రెస్‌ ‌కోరినట్లు తెలుస్తుంది. భేటీలో భట్టి విక్రమార్క ప్రొటోకాల్‌ ‌సమస్యను ప్రస్తావించినట్లు సమాచారం. చాలా సమస్యలపై చర్చ జరగాల్సి ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేయగా..బడ్జెట్‌పై చర్చ అనంతరం మిగతా అంశాలపై చర్చిద్దామన్న ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *