5కె రన్ లో పాల్గొన్న డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 19; ఐ ఓటు ఫర్ ష్యూర్ ’ నినాదంతో 5కె రన్ కార్యక్రమంలో భాగంగా జీ.హెచ్.ఏం.సీ.అధికారులు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి చింతలకుంట వరకు 5కె రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.అర్హత గల వారందరినీ ఓటరుగా నమోదు చేయడంతోపాటు,తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు తప్పుల సవరణ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను ఇట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది అని తెలిపారు.రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది.ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఓటింగ్ రోజు సెలవుదినం కాకుండా మన హక్కుల పరిరక్షణ కోసం విధిగా ఓటింగ్ లో పాల్గొనాలి అని కోరారు.కావున ప్రజలందరికి ఒకటే విజ్ఞప్తి.మీరందరు ఎన్నికల సమయంలో ఓటింగ్ లో పాల్గొని సరిఅయిన నాయకుడిని ఎన్నుకోండి.గత 25 సంవత్సరాలుగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని జరిగిన ఎన్నికల్లో కేవలం 40%-49% నమోదు కావడం జరిగింది.కావున వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలి అని కోరారు.అభివృద్ధి చేసే నాయకుడిని,పార్టీలను ఎన్నుకోవాలి అని కోరారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ,తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని కోరారు.ఇట్టి కార్యక్రమంలో ఎల్.బి.నగర్ సర్కిళ్ళ డిప్యూటీ కమిషనర్లు రవీందర్ కుమార్,దశరథ,అరుణ,ఎల్.బి.నగర్ ఏ.సి.పీ.జానకి రెడ్డి,పలువురు ఇన్స్పెక్టర్లు,ఏం.ఆర్.ఓ.లు,జీ.హెచ్.ఏం.సీ.అధికారులు,రెవెన్యూ అధికారులు,సిబ్బంది,స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఐ ఓటు ఫర్ ష్యూర్ ’ నినాదంతో 5కె రన్ కార్యక్రమంలో భాగంగా జీ.హెచ్.ఏం.సీ.అధికారులు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి చింతలకుంట వరకు 5కె రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.అర్హత గల వారందరినీ ఓటరుగా నమోదు చేయడంతోపాటు,తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు తప్పుల సవరణ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను ఇట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది అని తెలిపారు.రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది.ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఓటింగ్ రోజు సెలవుదినం కాకుండా మన హక్కుల పరిరక్షణ కోసం విధిగా ఓటింగ్ లో పాల్గొనాలి అని కోరారు.కావున ప్రజలందరికి ఒకటే విజ్ఞప్తి.మీరందరు ఎన్నికల సమయంలో ఓటింగ్ లో పాల్గొని సరిఅయిన నాయకుడిని ఎన్నుకోండి.గత 25 సంవత్సరాలుగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని జరిగిన ఎన్నికల్లో కేవలం 40%-49% నమోదు కావడం జరిగింది.కావున వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలి అని కోరారు.అభివృద్ధి చేసే నాయకుడిని,పార్టీలను ఎన్నుకోవాలి అని కోరారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ,తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని కోరారు.ఇట్టి కార్యక్రమంలో ఎల్.బి.నగర్ సర్కిళ్ళ డిప్యూటీ కమిషనర్లు రవీందర్ కుమార్,దశరథ,అరుణ,ఎల్.బి.నగర్ ఏ.సి.పీ.జానకి రెడ్డి,పలువురు ఇన్స్పెక్టర్లు,ఏం.ఆర్.ఓ.లు,జీ.హెచ్.ఏం.సీ.అధికారులు,రెవెన్యూ అధికారులు,సిబ్బంది,స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *