హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ సూచనల మేరకు గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా 20 మంది క్రాప్ట్ టీచర్స్ , 10 మంది గిరిజన ఆర్టిజన్స్ మొత్తం 30 మందికి గిరిజన సంప్రదాయక కళలపైన ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ అనే అంశంపై ఐదు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాదులో 26వ తేదీ నుండి మార్చి 2 వరకు నిర్వహిస్తున్నారు. శిక్షణలో పాల్గొన్న అభ్యర్థులు ఐటిడిఏ ఉట్నూర్, ఎటునాగారం, భద్రాచలం, ప్లెయిన్ ఏరియా నుండి సంబంధిత ఐటిడిఏ అధికారుల ద్వారా నామినేట్ అయి వచ్చారు. వీరందరికీ భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా పదిమంది గిరిజన ఆర్టిజన్స్ కు ప్రతిరోజు వెయ్యి రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఐ సంచాలకురాలు డాక్టర్ వి.సముజ్వల, టి ఆర్ ఐ సంగ్రహాలయ సంరక్షకులు డాక్టర్ డి సత్యనారాయణ , శిక్షణనిస్తున్న డైరెక్టర్ డాక్టర్ సునీతా ప్రసాద్ బృందం, ట్రైనింగ్ కోఆర్డినేటర్ శ్రీమతి అజ్మీరా శైలజ , టిఆర్‌ఐ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




