50 కులాలకు సంచార జాతులుగా గుర్తింపు

– సిఫారసుల నివేదికను ఆమోదించిన బీసీ కమిషన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తూ ప్రభుత్వానికి తన సిఫారసుల నివేదికను బీసీ కమిషన్ ఆమోదించింది. అలాగే ఈ కులాలకు సంబంధించిన సర్టిఫికెట్ జారీలో చేపట్టవలసిన మార్పులు, చేర్పుల గురించి కూడా ప్రభుత్వానికి సిఫారసులను ఆమోదించింది. రాష్ట్ర బీసీ కమిషన్ సమావేశం ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో చైైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ వివిధ అంశాలపై చర్చించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న సీడ్ పథకానికి అర్హులకు కావాల్సిన డిఎన్‌టి సర్టిఫికెట్ జారీ విధివిధానాలపై చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల్లో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల్లో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ మినహా మిగతా అన్ని శాఖల నుండి కమిషన్‌కు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఉద్యోగ రంగంలో బీసీల స్థితిగతులను అంచనా వేయడానికి ఉపయోగించనున్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్క్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బాల మాయదేవి పాల్గొన్నారు. అధికారులు డిప్యూటి డైరెక్టర్ యు.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె.మనోహర్ రావు, ప్రత్యేక అధికారి కుమారి ఎన్.సునీత, సెక్షన్ ఆఫీసర్ జి.సతీష్ కుమార్ హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *