400 సీట్లతో మళ్లీ మాదే అధికారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారం లోకి వొస్తామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా హైదరాబాద్‌ లోని కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ రోజురోజుకు కనుమరుగవుతుం దన్నారు. హామీలను నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్‌ లేదని విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన హావ్నిలను గాలికి వొదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు. తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ నాయకుడిగా గుర్తింపు పొందారని, ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తుందని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణకు ఆరు గ్యారంటీలు ఇచ్చి వంద రోజుల్లో చేసి తీరతామని హామీ ఇచ్చిన రాహుల్‌ గాంధీ  వాటిని అమలు చేయకుండా మళ్లీ రాష్ట్రానికి ఎలా వొస్తారని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. హావ్నిలు అమలు చేయలేదు కానీ… పెద్ద పెద్ద ప్రకటనలు, సభలు పెడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పతనం ప్రారంభమైందని, హావ్నిలను నెరవేర్చే స్థితిలో ఆ పార్టీ లేదని అన్నారు. అధికారంలోకి వొచ్చిన తర్వాత ఇచ్చిన గ్యారంటీలను గాలికి వొదిలేసిందని విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలను ఎక్కడ అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ హావ్నిల అమలుపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ రోజురోజుకు కనుమరుగవుతున్నదని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *