– జనగణనలో వాటిని కూడా చేర్చేలా చూడాలి
– సీఎస్‌ను కోరిన తెలంగాణ బీసీ కమిషన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: రాష్ట్రంలో జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు గృహాల నమోదు జరగనుంది. ఆ తర్వాత జనాభా గణన 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు జరగనుంది. జనగణనలో కేంద్ర ప్రభుత్వ ఓబీసీ లిస్టులో ఉన్న తెలంగాణలోని 90 కులాల ప్రజలను మాత్రమే ఓబీసీలుగా గణనలోకి తీసుకుంటున్నారు. తద్వారా రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల సంఖ్యను తక్కువగా చూపే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో 130 కులాలను వెనుకబడిన తరగతుల కులాలుగా గుర్తించారు. కాన కేంద్ర ప్రభుత్వం ఓబీసీ లిస్ట్‌లో కేవలం 90 కులాలను మాత్రమే చేర్చి 40 కులాలను చేర్చలేదు. తద్వారా తెలంగాణలో బీసీల సంఖ్య తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. బీసీ లిస్ట్‌లో లేని 40 కులాలను కూడా ఓబీసీ లిస్ట్‌లో చేర్చాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం, బీసీ కమిషన్ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఇప్పటివరకు దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ 40 కులాలను ఓబీసీ లిస్ట్‌లో చేర్చిన తర్వాతనే రాష్ట్రంలో జనగణనను ప్రారంభించాలి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రానికి చెందిన 40 బీసీ కులాలను కేంద్ర ఓబీసీ లిస్ట్‌లో చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఒక లేఖ ద్వారా బిసి కమిషన్ విజ్ఞప్తి చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.