– ఛేజ్ చేసి కారులోని రూ.4కోట్లు స్వాధీనం
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్5:కారులో తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. నగరంలోని శామీర్‌పేట వద్ద కారులో భారీగా హవాలా నగదు లభ్యమైంది. టైర్లు, సీట్ల కింద రూ.4 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయిన్‌పల్లి క్రైమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. హవాలా డబ్బు కేసులో 2024లో ఓ వ్యక్తి పరారయ్యాడు. నేడు అదే వ్యక్తి భారీ మొత్తంలో నగదుతో నిజామాబాద్ నుంచి వస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని, డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.