రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వొస్తోంది. ఇందులో భాగంగా పలు పేర్లు మార్పులతో పాటు రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం రూపు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మార్పులు చేసినట్లు తెలిపింది. కాగా తాజాగా కూడా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి 3న శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించనున్నారు.



