– మహా మెట్రోతో ఒప్పంద పత్రాల మార్పిడి
– పాల్గొన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి గడ్కరీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థలలో ఒకటైన క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ నాగ్‌పూర్‌లో 350కి పైగా పడకలతో అత్యాధునిక మల్టీ-స్పెషాలిటీ కేర్ హాస్పిటల్ నిర్మాణానికి లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ పొందింది. మహారాష్ట్ర, మధ్య భారతదేశంలో నాణ్యమైన వైద్య సేవలను విస్తరించడంలో ఇది కీలక ముందడుగుగా నిలుస్తోంది. ఈ లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ ను మహా – మెట్రో, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ మధ్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ సమక్షంలో మార్పిడి చేసుకున్నారు. నాగ్‌పూర్‌లోని కస్తూర్చంద్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని మహా -మెట్రో భూమిపై ఈ హాస్పిటల్ నిర్మించనున్నారు. సుమారు ₹600 కోట్ల పెట్టుబడితో భవిష్యత్ అవసరాలకనుగుణంగా ఆధునిక సదుపాయాలతో ఈ వైద్య సంస్థను అభివృద్ధి చేయనున్నారు. ఈ హాస్పిటల్‌లో గుండె సంబంధిత చికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, జీర్ణాశయ వ్యాధుల చికిత్సలు, ప్రమాద అత్యవసర సేవలు, మెదడు,నర సంబంధిత చికిత్సలు వంటి పలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు కానున్నాయి. నాగ్‌పూర్‌తో పాటు విదర్భ ప్రాంత ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన చికిత్స పొందే అవకాశం కలుగుతుంది.
దశల వారీగా ప్రారంభమయ్యే ఈ హాస్పిటల్ ద్వారా 1500కు పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. ప్రాంతీయ ఆరోగ్య రంగ అభివృద్ధికి ఇది తోడ్పడనుంది. ఈ సందర్భంగా క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే, సమగ్రంగా పనిచేసే, దీర్ఘకాలికంగా నిలకడైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడంలో సుస్థిర ప్రజా–ప్రైవేట్ భాగస్వామ్యాల ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాభివృద్ధితో ఆరోగ్య మౌలిక వసతులను అనుసంధానించడం ద్వారా మెట్రో నగరాలకు మాత్రమే కాకుండా ఇతర నగరాలకు కూడా ఉన్నత ప్రమాణాల వైద్య సేవలను విస్తరించవచ్చు. నాగ్‌పూర్ వంటి నగరాల్లో ఇలాంటి భాగస్వామ్యాలు ప్రాంతీయ ఆరోగ్య సామర్థ్యాన్ని పెంపొందించడంలో, నాన్ మెట్రో నగరాల దీర్ఘకాల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ సమాజ అవసరాలకు తగిన విధంగా స్పందించే, బలమైన సుస్థిర ఆరోగ్య వ్యవస్థను విస్తరించేందుకు ప్రజా–ప్రైవేట్ భాగస్వామ్యం ఎంతో అవసరం. నాగ్‌పూర్‌లో మా పెట్టుబడి, భాగస్వామ్య ఆధారిత అభివృద్ధి ద్వారా నాన్ మెట్రో నగరాల్లో మల్టీ-స్పెషాలిటీ సామర్థ్యాన్ని పెంచాలనే స్పష్టమైన లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం. ఈ హాస్పిటల్ అత్యున్నత వైద్య ప్రమాణాలతో సేవలందించడంతోపాటు నగర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ మద్దతుకు మేము కృతజ్ఞులం. మహారాష్ట్ర ప్రజలకు ఈ కీలక ఆరోగ్య సదుపాయాన్ని అందించేందుకు మహా -మెట్రోతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం అని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





