నేత కార్మికుల రుణ మాఫీకి రూ.33 కోట్లు విడుదల

– ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో నేతన్నలకు ఉపాధి
– వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్న రుణ మాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకోసం గురువారం రూ.33 కోట్లు విడుదల చేశారని చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకురావడంతోపాటు పునరుద్ధరించినట్ల చెప్పారు. ప్రజా ప్రభుత్వ నిర్ణయాల వల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి లభిస్తోందని, అందులో భాగంగా టెస్కోకు రూ.588 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని పేర్కొన్నారు. నేత కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. సిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హన్మకొండ జిల్లాల్లోని 130 ఎంఏసీఎస్‌, 56 ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద సహాయక సంఘాల మహిళా సభ్యులకు అందించే చీరల ఉత్పత్తి జరిగిందని, తద్వారా మహిళలకు నాణ్యమైన చీరలు అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 ప్రకారం అన్ని శాఖలు అవసరమైన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని చెప్పామని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం వస్త్రాలు, రెసిడెన్షియల్‌ విద్యార్థులకు యూనిఫాం వస్త్రాలతోపాటు, తువాళ్లు, చద్దర్లు, బ్లాంకెట్లు, కార్పెట్లు అందించనున్నట్లు, అలాగే శిశు సంక్షేమ శాఖలోని అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు, ఆశా వర్కర్లకు నాణ్యమైన చీరలు అందించడం ద్వారా నేత కార్మికులకు, అనుబంధ కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తోందన్నారు. నేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.168 కోట్లతో తెలంగాణ చేనేత అభయ హస్తం పేరుతో మూడు ముఖ్యమైన పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు.ఇండస్ట్రీస్‌ ప్రారంభించడం ద్వారా 800 మంది మహిళలకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. నేత కార్మికులు ఆర్థికంగా బలపడేలా, వారి కుటుంబాలు సుస్థిరంగా నిలిచేలా చేనేత రంగానికి అన్ని విధాల తోడ్పాటు అందించడం తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఈ లక్ష్యం సాధనలో మరిన్ని చర్యలు చేపడతామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page