యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 27: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కోసం యాదగిరిగుట్ట మండలంలో ఐదు నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు గురువారం సర్పంచ్ పదవులకు 31మంది, వార్డు సభ్యుల పదవులకు 49మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి నవీన్ తెలిపారు. దాతర్‌పల్లి, గౌరాయపల్లి, మాసాయిపేట, పెద్ద కందుకూర్, వంగపల్లిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల పరిధిలో మొత్తం 23 గ్రామ పంచాయతీలు, 198 వార్డులు ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





