– ముగ్గురు మావోయిస్టుల మృతి
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గడ్ సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుండి భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. గొల్లపల్లి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాదళాలు అటవీ పర్వత ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టుల కోసం అడవులను జల్లెడపడుతున్నాయి. అడవిలో కూంబింగ్ చేస్తున్న భద్రతాదళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతాదళాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించిన విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు. అటవీ పర్వత ప్రాంతం మొత్తాన్ని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డస్(డీఆర్జీ), భద్రతాదళాలు చుట్టుముట్టేశాయి. మావోయిస్టుల వైపునుండి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సంఘటనా స్దలంలో భారీగా ఆయుధాలు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





