రాష్ట్రంలో 3 రోజులపాటు వర్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజులపాటు ఒక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పడతాయని తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌ నగరంలో అనేక‌చోట్ల‌ మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాగా, వెళ్లాల్సిన మార్గాల్లో ట్రాఫిక్‌ జాంల గురించి ముందుగా తెలుసుకోవాలని, విద్యుత్‌ స్తంభాలు, నీళ్లు నిల్వ ఉండే ప్రదేశాలు, ఓపెన్‌ డ్రైనేజీలకు దూరంగా ఉండాలని ప్రజలకు ‘హైడ్రా’ విజ్ఞప్తి చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *