– నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్ శర్మలను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసుల అభ్యర్థనపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు అనుమతితో నిందితులను రేపటి నుంచి కస్టడీకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా, నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక విషయాలను వెలికితీయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా కస్టడీ విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.