హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అయితే గత సమావేశాల కొనసాగింపుగానే నోటిఫికేషన్ జారీ అయింది.
గతంలో 3న సమావేశాలు ప్రారంభించి అదే రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావించింది. మారిన షెడ్యూల్ మేరకు 3న గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తరవాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. వీనిపై సిఎం కెసిఆర్ సమాధానం ఇవ్వడం ఆనవాయితీ. ఆ తరవాతనే బడ్జెట్ ప్రవేశ పెడతారు.





