3 కోట్లతో ప్రతి కాలనీలో సిసి రోడ్లు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు : ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకటరెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర జులై 17: గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గ్రామంలోని పొలాలకు వెళ్లే ఫార్మషన్ రోడ్లను దాదాపు మూడు కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో ఎమ్మెల్యే యాదయ్య ప్రోత్సాహంతో అభివృద్ధిలో తీర్చిదిద్దడం జరిగిందని ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెల్లుబాటు కానీ నాయకులు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతుంటే కేవలం బురదజల్లే పని పెట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో గ్రామంలో ఏ కాలనీలో చూసినా నడవలేని దుస్థితి ఉండేది ఎక్కడ చూసినా మురుగునీరు తాండవం చేసేది దీంతో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు రోగాల బారిన పడేవారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రస్థానంతో దాదాపు మూడు కోట్ల రూపాయలతో ప్రతి కాలనీలో ప్రతి గల్లీలో సిసి రోడ్లు ఏర్పాటు చేసి కొన్ని కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తిచేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దడం జరుగుతుందని సర్పంచ్ వెంకటరెడ్డి తెలిపారు. గ్రామానికి వచ్చే దారిలో రోడ్లకు ఇరువైపులా హరితహారంలో మొక్కలు నాటి పెంచి ఆహ్లాదకర వతావరణం తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఎక్కడ కూడా ఏ వెంచర్ లో డబ్బులు తీసుకోలేదని గ్రామపంచాయతీకి వచ్చిన ఆదాయంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. కొండపైన సాయిబాబా ఆలయం నిర్మించామని తెలిపారు. గ్రామ సమీపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఆలయం వరకు సిసి రోడ్డు నిర్మాణం చేసి సరైన విధంగా రవాణా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధిలో తీర్చిదిద్దుతుంటే ఓర్వలేక కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎవరి క్యారెక్టర్ ఏమిటో గ్రామ ప్రజలకు తెలుసు అని సర్పంచ్ వెంకటరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *