పాట్నా, నవంబర్ 10: బీహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 121 స్థానాల్లో పోలింగ్ జరుగగా.. మిగిలిన 122 స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. సుమారుగా 4 కోట్ల మంది వోటర్లు వారి గెలుపోటములను నిర్దారించనున్నారు. రెండో దశలో భాగంగా పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, మధుబని, సుపౌల్, అరేరియా, కిషన్‌గంజ్ తదితర జిల్లాల్లో పోలింగ్ జరుగనుంది. పోలింగ్ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 4 లక్షల మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలను ఇందుకు వినియోగించారు. ఇప్పటికే సిబ్బంది పోలింగ్‌కు అవసరమైన సామాగ్రితో సంబంధిత బూత్‌లకు చేరుకున్నారు.తొలి దశలో మాదిరిగా ఈ దిశలో కూడా నితీశ్ సర్కారులోని పలువురు మంత్రులు, ముఖ్య నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకో నున్నారు. ఈ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్, ఎన్డీయే కూటమిల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. వీరితోపాటు కొత్తగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ, లాలూ యాదవ్ పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నేతృత్వంలోని జన్‌శక్తి జనతాదళ్ పార్టీ బరిలో నిలిచాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





