ముంబై ఎయిర్‌పోర్టులో 29 కిలోల బంగారం సీజ్‌

-‌ కెన్యా నుంచి వస్తున్న మహిళల నుంచి స్వాధీనం

ముంబై, ఏప్రిల్‌10: ‌ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 29 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ ‌చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముంబై విమానాశ్రయం లో భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నారని డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారు అప్రమత్తమై ఆపరేషన్‌ ‌ధహాబు పేరుతో విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కెన్యాలోని నైరోబీ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా బంగారం బయటపడింది. మహిళలు దుస్తులు, బ్యాగుల్లో సుమారు 29 కిలోల బంగారాన్ని దాచినట్లు గుర్తించారు. బంగారాన్ని సీజ్‌ ‌చేసిన అధికారులు 26మంది కెన్యా దేశస్థులను అరెస్ట్ ‌చేశారు. విమానాశ్రయంలోని గ్రీన్‌ ‌ఛానల్‌ ‌దాటిన తర్వాత అధికారులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *