29న బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం సమావేశం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్మికుడు భాగస్వామి అయ్యేలా ఈనెల 29 న పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి కార్మికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు బిఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరి యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గంలోని కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అలుపెరుగని కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి కార్మికుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ అని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ఇటీవల 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు చేపడుతున్నామని తెలిపారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈనెల 29న ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *