– రాష్ట్రవ్యాప్తంగా 3,836 కార్యక్రమాలు పూర్తి
– నిజామాబాద్లో పాల్గొన్న డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రాణనష్టాన్ని సున్నాకు తగ్గించడమే లక్ష్యం గా తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయ వంతంగా కొనసాగుతోంది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమాలు జ నవరి 27వ తేదీ వరకు కొనసాగుతాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిజామాబాద్లో ని ర్వహించిన అవగాహన సదస్సులో ఆయన స్వయంగా పాల్గొని ప్రసంగించారు.
ఈనెల 20న నిర్మల్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీజీపీ బి.శివధర్ రెడ్డి నిజామాబాద్ లో శుక్రవారం జరిగిన కార్యక్ర మంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాల సంఖ్య 3,836కు చేరింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమా దాలు, ప్రాణ నష్ఠాలను గణనీయంగా తగ్గిం చాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ రోడ్ సేఫ్టీ అవగాహన ప్రచారాన్ని అమలు చేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతను సామూహిక ఉద్యమంగా మార్చడమే ప్రధాన ఉద్దేశంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి పౌరుడిలో రోడ్డు భద్రత పట్ల బాధ్యతాభావం పెంపొందించడం, ప్రమాదాలకు దారితీసే నిర్లక్ష్యపు ప్రవర్తనను తగ్గించడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని బలోపేతం చేయడం ఈ ప్రచార కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేస్తూ సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మీడియా, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖలు, న్యాయవ్యవస్థ ప్రతినిధుల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం కొనసాగుతోంది.
ఆదర్శ రోడ్డు భద్రతా రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
తెలంగాణను దేశానికి ఆదర్శ రోడ్డు భద్రతా రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. హెల్మెట్ వినియోగం , సీటు బెల్ట్ ధరించడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం నివారణ, మద్యం సేవించి డ్రైవింగ్ పై కఠిన చర్యలు, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటో ఓవర్?లోడింగ్, మీటర్–యూనిఫాం నిబంధనల అమలు, హైబీమ్ లైట్ల దుర్వినియోగం చేయకపోవడం, ఎడమవైపు నుంచి ఓవర్ టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్ల నిర్మూలన వంటి ప్రాధాన్యత అంశాలను ఆయా కార్యక్రమాల్లో వివరిస్తున్నారు. జిల్లాస్థాయిలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. డివిజన్స్థాయిలో ఎస్డీపీఓలు, మండలస్థాయిలో సీఐలు, ఎస్సైలు, గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ ట్రాఫిక్ సేఫ్టీ కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎన్సీసీ ప్రతినిధులు, యువత, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ యజమానులు తదితరులను ఈ ఉద్యమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. డిఫెన్సివ్ డ్రైవింగ్, విద్యార్థులు-యువత అవగాహన, గ్రామీణ రోడ్డు భద్రత, మహిళలు-కుటుంబ భద్రత, మద్యం సేవించి వాహనం నడపే వారిపై జీరో టాలరెన్స్, కార్పొరేట్-రవాణారంగ సహకారం వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, క్యాబ్ సేవలు, మాల్స్, మార్కెట్లు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, మత సంస్థలు, స్వయం సహాయక సంఘాలతో కలిసి విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





