– అన్నామలైకి దక్కని స్థానం
– పార్టీతో దూరం పెరిగిందన్న ప్రచారం
చెన్నై, ఏప్రిల్ 3: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళసై సౌందరరాజన్కు పార్టీ టిక్కెట్ దక్కిన ప్పటికీ, పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత కె. అన్నామలైకి ఈ జాబితాలో చోటుదక్కలేదు. అన్నామలై 2021 జూలై నుంచి ఏప్రిల్ 2025 వరకూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉ న్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీకి ఆయనను పార్టీ అధిష్ఠానం దూరంగా ఉంచింది. దీనిపై నాగేంద్రను అడిగినప్పుడు, పార్టీ కేంద్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్టీ ప్రకటించిన 27 మంది కచ్చితంగా నెగ్గితీరుతారని ఆయన ధీమా వ్యక్తం చే శారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలైకు టిక్కెట్ ఇవ్వకపోవడం వెనుక కారణాలపై తాజాగా చర్చజరుగుతోంది. బీజేపీ- అన్నాడీఎంకే మధ్య సీట్ల పంపకాలపై మొదట్నించీ అన్నామలై అసంతృప్తితో ఉన్నారు. దీనితోపాటు, బీజేపీ సునాయాసంగా నెగ్గే సీట్లను అన్నాడీఎంకే కేటాయించ లేదంటూ బీజేపీ అధిష్ఠానానికి ఆయన లేఖ రాశారు. ఈసారి పోటీకి తనను దూరంగా ఉంచాలని కూడా అధిష్ఠానాన్ని ఆయన కోరినట్టు చెబుతున్నారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తును అన్నామలై ఏనాడూ సమర్థించలేదు. ఎన్డీయేలోకి అన్నాడీఎంకే తిరిగి రావా లంటే అన్నామలైను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పొత్తులకు ముందు బీజేపీ అధిష్ఠానం ముందు ఎడప్పాడి కె పళనిస్వామి షరతు పెట్టినట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తదనంతర క్రమంలో తన తండ్రికి అనారోగ్యంగా ఉందంటూ పార్టీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేయడం, నాగేంద్రన్ ఆ పదవిని చేపట్టడం జరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నామలై పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి ఆర్.ఇలాంగో చేతిలో 24,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





