ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 26న ఆమనగల్లు పట్టణానికి కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి కి మద్దతుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతున్నట్లు బిజెపి అభ్యర్థి ఆచారి తెలిపారు. ఆమనగల్లులో ఏర్పాటు చేసే యోగి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం షాద్నగర్ ఏసిపి రంగస్వామి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం పోలీస్ సిబ్బందితో సభాస్థలిని పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని.. సభ ప్రాంతాన్ని పరిశీలించి నిర్వహణకు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి హరిప్రసాద్, బిజెపి నాయకులు బైకనీ శ్రీశైలం యాదవ్, అశోక్ యాదవ్, శ్రీకాంత్ సింగ్, పాషా, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
26న ఆమనగల్లు కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి రాక





