ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : ఆమనగల్లు మున్సిపాలిటీలో ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ సంస్మరణ సభ వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పూలే జ్ఞాన గ్రంథాలయ కన్వీనర్ జి. సుధాకర్ మాట్లాడుతూ కోట్లాది ప్రజలను తన పాటల ద్వారా ఇంతగా ప్రభావితం చేసిన ప్రజా గాయకుడు గద్దర్ అని అన్నారు. ఆమనగల్లు ఎంపీపీ అనిత విజయ్ మాట్లాడుతూ తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన సంఘ సేవకర్త అని కొనియాడారు. ఈ నెల 24 వ తేదీన ఉదయం 10 గంటలకు సభ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాయకురాలు విమలక్క, లేల్లి సురేష్, ప్రొఫెసర్ వెంకటదాసు, సి ఎల్ యాదగిరి, జక్కగోపాల్ జి, యాదగిరి, హాజరవుతున్నారని తెలిపారు. కోఆర్డినేటర్ జి. సుధాకర్, కడ్తాల ఎంపిపి కమ్లి మోత్యా నాయక్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు విఠాయిపల్లి రమేష్, పసుపుల సాయిలు, ఆమనగల్లు అడ్వకేట్ ఆంజనేయులు యాదవ్, కొప్పు కృష్ణ, తలకొండపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దరువుల శంకర్, వరకాల శేఖర్, ఎమ్మార్పీఎస్ మల్లెపోగు మల్లేష్, ఎస్సీ ఎస్టీ నెంబర్ జంతుక శంకర్, దళిత నాయకులు డేవిడ్, బిక్షపతి, వంకేశ్వరం భీమయ్య, కోట కృష్ణయ్య, మీసాల రమేష్, కే. అల్లాజి, బిఎస్పి మహేష్, బద్ది వెంకటేష్, వెంకటాపురం శివ, కోప్పు విజయ్, జంతుక గిరి, నవీన్, చంద్ర గౌడ్, యాదయ్య, జంగయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


